IIITDM Recruitment: కర్నూలు ఐఐఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

Nov 06, 2021 | 9:33 AM

IIITDM Recruitment: కర్నూలులో ఉన్న ఇండియణ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో..

IIITDM Recruitment: కర్నూలు ఐఐఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Iiitdm Recruitment
Follow us on

IIITDM Recruitment: కర్నూలులో ఉన్న ఇండియణ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్ రిజిస్టార్ (03), టెక్నికల్‌ ఆఫీసర్‌ (01), జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండంట్‌ (02), జూనియర్‌ అసిస్టెంట్‌ (01), జూనియర్‌ టెక్నీషియన్‌ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 03-11-2021న ప్రారంభమవుతుండగా, 02-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Dantewada Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి

Max Pro X6: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌.. మ్యాక్స్‌ ప్రో ఎక్స్‌6 ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Dantewada Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి