IIIT Nagpur Technical Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Nagpur).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 7 టెక్నికల్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ల్యాబొరేటరీ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), జూనియర్ అసిస్టెంట్ (మల్టీ-స్కిల్డ్)- అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ (మల్టీ-స్కిల్డ్)- అకౌంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్ 19వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్: The Director,
Indian Institute of Information Technology, Nagpur
S.No. 140,141/1 Behind Br. Sheshrao Wankhade Shetkari Sahkari Soot Girni,
Village – Waranga, PO – Dongargaon (Butibori),
District – Nagpur, Maharashtra – Pin Code – 441108.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.