IFGTB Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్మతతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

|

Oct 21, 2022 | 7:21 AM

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని కోయింబత్తూరులోనున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌.. 10 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), టెక్నికల్ అసిస్టెంట్‌ (టీఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

IFGTB Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్మతతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
IFGTB
Follow us on

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని కోయింబత్తూరులోనున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌.. 10 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), టెక్నికల్ అసిస్టెంట్‌ (టీఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, బోటనీ/అగ్రికల్చర్‌ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 25, 2022వ తేదీ నాటికి 18 నుంచి 33 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో..

 

  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ్‌/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్ధులకు రూ.250లు
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ) ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ్‌/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్ధులకు రూ.500లు
  • టెక్నికల్ అసిస్టెంట్‌ (టీఏ) ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ్‌/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్ధులకు రూ.750ల చొప్పున అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.29,200లతోపాటు ఇతర అలవెన్స్‌లను కూడా జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.