IDBI Bank Jobs 2025: డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

దేశ వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌ బ్రాంచుల్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

IDBI Bank Jobs 2025: డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు
IDBI Bank Jobs

Updated on: May 07, 2025 | 4:16 PM

ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసక్తి కలిగిన అభ్యర్థులు మే 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 676 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజర్‌ (జేఏఎం) గ్రేడ్‌-ఓ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు 55 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మే 1, 2025వ తేదీ నాటికి 20 నుంచి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మే 2, 2000 నుంచి మే 1, 2005వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నమాట. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా మే 20, 2025వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1050, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు 200 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు 4 విభాగాల్లో జరుగుతుంది. రీజనింగ్‌ విభాగంలో 60 ప్రశ్నలకు 60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌ విభాగంలో 60 ప్రశ్నలకు 60 మార్కుల చొప్పున ఉంటుంది. పరీక్ష మొత్తం 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.