ICAR Recruitment 2021: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు నియామకాలను ప్రకటించింది. ఐసిఎఆర్ కింద మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icar.org.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ICAR జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. గుర్తింపు పొందిన సంస్థ నుంచి B.Com లేదా BBA లేదా BBS, CA ఇంటర్ లేదా ICWA ఇంటర్ లేదా CS ఇంటర్ కలిగి ఉండటం అవసరం. ఇందులో (ఐసిఎఆర్ రిక్రూట్‌మెంట్ 2021) దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. అలాగే అభ్యర్థికి కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి. ఖాళీల (ఐసిఎఆర్ రిక్రూట్మెంట్ 2021) గురించి పూర్తి సమాచారం వచ్చిన తరువాత మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు పరిధి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) జారీ చేసిన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వయస్సు 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
చివరి తేదీ
ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి జూలై 20 చివరి తేదీ. దరఖాస్తు చేసేటప్పుడు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఏదైనా తప్పు అనిపిస్తే దరఖాస్తు తిరస్కరిస్తారు. చివరి తేదీ తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించరని అభ్యర్థులు గమనించాలి.
రాతపరీక్ష ద్వారా ఎంపిక
నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఐసిఎఆర్ విడుదల చేసింది. వచ్చిన దరఖాస్తులను అనుగుణంగా ఎంపిక చేసిన అభ్యర్థులను రాత పరీక్ష కోసం ఆహ్వానించవచ్చు. అవసరమైతే షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ప్యానెల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఈ నియామకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ icar.org.in లో నోటిఫికేషన్ పోస్ట్ చేశారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.