ICAR IARI Research Associate Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI).. ఒప్పంద రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల (Research Staff posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
ఖాళీల సంఖ్య: 4
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: Division of Plant Pathology, ICAR- Indian Agricultural Research Institute, New Delhi – 110012.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: