ICAI CA Final Result Jan 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జరివరిలో జరిగిన ఛార్టెడ్ అకౌంటెంట్, ఫౌండేషన్ తుది ఫలితాలను విడుదల చేసింది. సీఏ ఫౌండేషన్ పాత, కొత్త కోర్సుల పరీక్షల ఫలితాలను ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సీఏ ఫౌండేషన్ ఫైనల్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్లు అయిన icaiexam.icai.org, caresults.icai.org, icai.nic.in లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా వారి రిజిస్ట్రేషన్ లేదా హాల్ టికెట్ నంబర్లను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్టర్ట్ ఈ మెయిల్ ద్వారా aticaiexam.icai.org వెబ్‌సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఇలాచేస్తే అభ్యర్థుల ఫలితాలు నేరుగా ఈ మెయిల్‌కు వస్తాయని అధికారులు వెల్లడించారు.
ICAI ఫలితాలను ఇలా తెలుసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org, caresults.icai.org లేదా icai.nic.in. లో లాగిన్ అవ్వండి
రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ లేదా పిన్ నంబర్‌ను దానిలో ఎంటర్ చేయండి.
దీని తరువాత ICAI CA ఫైనల్, CA ఫౌండేషన్ ఫలితాల మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది.
అనంతరం ఫైనల్ రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
Also Read: