IBPS PO 2023 Notification: బ్యాంక్‌ జాబ్స్‌.. ఐబీపీఎస్‌లో 3,049 పీఓ, ఎస్‌పీఎల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

|

Aug 01, 2023 | 1:59 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ పీఓ/ ఎంటీ XIII), స్పెషలిస్ట్‌ ఆఫీసర్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌ XIII) నియామక పరీక్షల ద్వారా ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

IBPS PO 2023 Notification: బ్యాంక్‌ జాబ్స్‌.. ఐబీపీఎస్‌లో 3,049 పీఓ, ఎస్‌పీఎల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
IBPS
Follow us on

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ పీఓ/ ఎంటీ XIII), స్పెషలిస్ట్‌ ఆఫీసర్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌ XIII) నియామక పరీక్షల ద్వారా 3,049 ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

అన్‌లైన్‌ దరఖాస్తులకు పీవో/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు అయితే ఆగస్టు 21, 2023వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ సెప్టెంబర్‌/ అక్టోబర్‌ 2023 జరగనుంది. మెయిన్ ప‌రీక్ష నవంబర్‌ 2023లో నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూ జనవరి/ ఫిబ్రవరి 2024లో నిర్వహిస్తారు.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది ఆగస్టు 21, 2023. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష డిసెంబర్‌ 2023లో ఉంటుంది. మెయిన్ ప‌రీక్ష జనవరి 2024లో నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూ ఫిబ్రవరి/ మార్చి 2024లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎంపిక విధానం..

ఆన్‌లైన్ టెస్ట్‌ (ప్రిలిమిన‌రీ, మెయిన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. లెటర్‌ రైటింగ్‌, ఎస్సే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో మాత్రమే సమాధానాలు రాయవల్సి ఉంటుంది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.