IBPS Notification 2021: తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పదివేల బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… చివరి తేదీ ఎప్పుడంటే

|

Jun 08, 2021 | 3:29 PM

IBPS Notification 2021:నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది బ్యాంకింగ్ రంగం. దేశ వ్యాప్తంగా ఉన్న

IBPS Notification 2021: తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పదివేల బ్యాంక్  ఉద్యోగాలకు నోటిఫికేషన్... చివరి తేదీ ఎప్పుడంటే
Ibps
Follow us on

IBPS Notification 2021:నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది బ్యాంకింగ్ రంగం. దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ బ్యాంకుల్లో 10 వేలకు పైగా పోస్టుల భర్తీని చేపట్టనుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ గ్రామీణ బ్యాంకులు నియామకాలను చేపట్టనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం-
2021 జూన్ 8
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
2021 జూన్ 28

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ ఉంటుంది. అప్లై చేయడానికి ముందు విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి.

Also Read: అమ్మ చేతి కమ్మని వంట.. ఈజీగా టేస్టీగా చింతచిగురు రొయ్యలు కూర తయారీ