IBPS Clerk Mains Admit Card 2022: ఐబీపీఎస్ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..?

|

Jan 16, 2022 | 8:43 AM

IBPS Clerk Mains Admit Card 2022: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 మెయిన్స్ ఎగ్జామ్ కోసం అ

IBPS Clerk Mains Admit Card 2022: ఐబీపీఎస్ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..?
Ibps Clerk Exam Date
Follow us on

IBPS Clerk Mains Admit Card 2022: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 మెయిన్స్ ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మెయిన్స్‌ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 7858 పోస్టులను భర్తీ చేస్తారు. ఇంతకుముందు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాల్సిన క్లర్క్ పోస్టుల సంఖ్య 7800. ప్రస్తుతం 58 పోస్టులను ఐబీపీఎస్ పెంచింది. ఈ నెలలో మెయిన్స్ పరీక్ష నిర్వహించవచ్చని సమాచారం. కాబట్టి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సిద్ధంగా ఉంటే మంచిది.

IBPS తరపున ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 07 అక్టోబర్ 2021న ప్రారంభమైంది. అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అక్టోబర్ 27 వరకు గడువు ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 2021లో జరిగింది. దీని ఫలితాలు 13 జనవరి 2022న విడుదలయ్యాయి. ఇప్పుడు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

1. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.inకి వెళ్లండి.

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ లింక్‌కి వెళ్లండి.

4. క్లర్క్‌ల నియామకం కోసం సాధారణ నియామక ప్రక్రియ లింక్‌పై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తారు.

6. తర్వాత అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

7. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

మెయిన్స్ పరీక్ష

ప్రిలిమ్స్‌ను క్లియర్ చేసి మెయిన్స్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు IBPS క్లర్క్ పరీక్షా సరళిని దృష్టిలో ఉంచుకుని సిద్ధం కావాలని నిపుణులు సూచించారు. నోటిఫికేషన్ ప్రకారం మెయిన్స్ పరీక్షలో 160 నిమిషాల్లో 190 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 11 బ్యాంకులు పరీక్షలో పాల్గొంటాయి. ఈ బ్యాంకులు- బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.

పెట్టుబడికి ఉత్తమ మార్గం ఈ ప్రభుత్వ పథకం.. మెరుగైన వడ్డీ.. ఇంకా పన్నుమినహాయింపు..

తోడేళ్లని విపరీతంగా చంపుతున్న స్వీడెన్, నార్వే ప్రజలు.. దీని వెనుక కారణం ఏంటంటే..?

IND vs SA U-19 World Cup: సౌతాఫ్రికాపై భారత్‌ సూపర్ విక్టరీ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధూల్‌..