IBPS 2023 Exam Calendar: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? ఐబీపీఎస్‌ పరీక్షల క్యాలెండర్‌ 2023-24 ఇదే..

|

Jan 18, 2023 | 11:59 AM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) 2023-2024 విద్యా సంవత్సరానికిగానూ బ్యాంకు పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. వివిధ..

IBPS 2023 Exam Calendar: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? ఐబీపీఎస్‌ పరీక్షల క్యాలెండర్‌ 2023-24 ఇదే..
IBPS 2023 Exam Calendar
Follow us on

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) 2023-2024 విద్యా సంవత్సరానికిగానూ బ్యాంకు పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్‌తో ఆర్‌ఆర్‌బీల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ ఉద్యోగాలకు ఏయే తేదీల్లో నోటిఫికేషన్లు విడుదలవుతాయి, పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారనే పూర్తి సమాచారం తెలియజేసింది. ఇక ఇందుకు సంబంధించి త్వరలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది.

ఐబీపీఎస్ ఎగ్జామినేషన్‌-2023 క్యాలెండర్ ఇదే..

ఆర్‌ఆర్‌బీ – సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XII (ఆఫీస్ అసిస్టెంట్), సీఆర్‌పీ ఆర్‌ఆర్‌ఆబీ-XII (ఆఫీసర్‌) పరీక్షల తేదీలు ఇలా..

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌-1) పరీక్ష ఆగస్టు 5, 6, 12, 13, 19 తేదీల్లో జరుగుతుంది
  • సింగిల్ ఎగ్జామ్ (ఆఫీసర్‌ స్కేల్‌-2 & 3) పరీక్ష సెప్టెంబర్ 10 తేదీన జరుగుతుంది
  • మెయిన్ ఎగ్జామ్ (ఆఫీసర్ స్కేల్-1) పరీక్ష సెప్టెంబర్ 10 తేదీన జరుగుతుంది
  • మెయిన్ ఎగ్జామ్ (ఆఫీస్‌ అసిస్టెంట్‌) పరీక్ష సెప్టెంబర్ 16 తేదీన జరుగుతుంది

పీఎస్‌బీ- సీఆర్‌పీ క్లర్క్‌-XIII, సీఆర్‌పీ పీవో/ ఎంటీ-XIII & సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌-XIII పరీక్షల తేదీలు ఇలా..

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (క్లర్క్‌) పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2 తేదీల్లో జరుగుతుంది
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ (క్లర్క్‌) పరీక్ష అక్టోబర్ 7న జరుగుతుంది
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (ప్రొబేషనరీ ఆఫీసర్) పరీక్ష సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 1 తేదీల్లో జరుగుతుంది
  • మెయిన్ ఎగ్జామినేషన్‌ (ప్రొబేషనరీ ఆఫీసర్) పరీక్ష నవంబర్ 5న జరుగుతుంది
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (స్పెషలిస్ట్ ఆఫీసర్) పరీక్ష డిసెంబర్ 30, 31 తేదీల్లో జరుగుతుంది
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ (స్పెషలిస్ట్ ఆఫీసర్) పరీక్ష జనవరి 28, 2024న జరుగుతుంది

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.