ECIL Recruitment 2021: హైద‌రాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

|

Jun 01, 2021 | 10:13 AM

ECIL Recruitment 2021: హైద‌రాబాద్‌లో ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ‌లో...

ECIL Recruitment 2021: హైద‌రాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Ecil Hyderabad
Follow us on

ECIL Recruitment 2021: హైద‌రాబాద్‌లో ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 20 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రాజెక్ట్ ఇంజినీర్ (12), అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌ (08) ఉద్యోగాల‌ను భర్తీ చేయ‌నున్నారు.

* ప్రాజెక్ట్ ఇంజినీర్‌లో భాగంగా ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించాలి. దీంతో పాటు సంబంధిత ప‌నిలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 30.04.2021 నాటికి 30 ఏళ్లు మించ‌కూడదు.

* అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌లో భాగంగా ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థులు.. క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 30.04.2021 నాటికి 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ. 40,000.. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు ఎంపికై వారికి రూ. 30,000 చెల్లిస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈసీఐఎల్ ఆఫీసును నేరుగా సంద‌ర్శించాలి. అభ్య‌ర్థుల‌ను వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* వాక్ ఇంట‌ర్వ్యూ తేదీల‌ను జూన్ 15, 16 తేదీల్లో నిర్వ‌హించనున్నారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read:  Coconut Water : కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..! ఎందుకు తాగాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

TS Inter: తెలంగాణ ఇంట‌ర్ అడ్మిష‌న్లకు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. క‌రోనా కార‌ణంగా ఆన్‌లైన్‌లోనే ఎన్‌రోల్‌మెంట్‌..

National Library Recruitment 2021: నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం