CDAC Recruitment 2021: హైద‌రాబాద్ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది ఎప్పుడంటే..

|

May 05, 2021 | 5:38 AM

CDAC Recruitment 2021: హైద‌రాబాద్‌లో ఉన్న సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 44 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు...

CDAC Recruitment 2021: హైద‌రాబాద్ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది ఎప్పుడంటే..
Jobs In Cdac
Follow us on

CDAC Recruitment 2021: హైద‌రాబాద్‌లో ఉన్న సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 44 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు. 44 పోస్టుల్లో భాగంగా ప్రాజెక్ట్ మేనేజ‌ర్ (03), ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 39, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ (02) పోస్టులకు నోటిఫికేష‌న్ జారీ చేశారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ప్రాజెక్ట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు.. సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త సాధించ‌డంతో పాటు.. సంబంధిత ప‌నిలో అనుభ‌వం, వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

* ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు.. సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు.. సంబంధిత ప‌నిలో అనుభ‌వం, వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

* ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు.. రెండేళ్ల ఎంబీఏ/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం, వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను 06.05.2021 నుంచి ప్రారంభిస్తూ.. చివ‌రితేదీగా 20.05.2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Also Read: వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..

Viral Video : ఇంజెక్షన్‌ అంటే ఈ యువతి ఎలా భయపడుతుందో చూడండి..! వైరల్‌గా మారిన వీడియో..

Viral: నీటిలో ఈత కొడుతోన్న కోతి.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో.!