Infantry School Jobs 2022: నెలకు రూ.81,100ల జీతంతో.. ఇండియన్‌ ఆర్మీ ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో101 గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు..

|

Jun 16, 2022 | 9:37 AM

ఇండియన్ ఆర్మీకి చెందిన మధ్యప్రదేశ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం (Infantry School HQ).. గ్రూప్‌ - సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Infantry School Jobs 2022: నెలకు రూ.81,100ల జీతంతో.. ఇండియన్‌ ఆర్మీ ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో101 గ్రూప్‌ సీ ఉద్యోగాలు..
Indian Army
Follow us on

Indian Army Infantry School Group C Recruitment 2022 : ఇండియన్ ఆర్మీకి చెందిన మధ్యప్రదేశ్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం (Infantry School HQ).. గ్రూప్‌ – సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 101

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డ్రాఫ్ట్స్‌మెన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, స్టెనోగ్రాఫర్‌, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌, కుక్‌, ట్రాన్స్‌లేటర్, బార్బర్‌, ఆర్టిస్ట్‌/ మోడల్‌ మేకర్‌ పోస్టులు.

ఖాళీల వివరాలు:

  • ఇన్‌ఫ్రాంట్రీ స్కూల్‌, మౌ స్టేషన్‌ పోస్టులు: 65
  • ఇన్‌ఫాంట్రీ స్కూల్‌, బెల్గాం (కర్ణాటక) పోస్టులు: 36

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.19,900ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి, ఇంటర్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్ట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకుగానూ 2 గంటల సమయంలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది.

  • జనరల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు రుసుము: రూ.50

అడ్రస్‌: ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, అప్లికేషన్‌ స్కృటినీ బోర్డు, ది ఇన్‌ఫాంట్రీ స్కూల్‌, మౌ, మధ్యప్రదేశ్‌-453441.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.