HQ Eastern Command Jobs 2022: ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్‌లో గ్రూప్ సీ సివిలియన్‌ ఉద్యోగాలు.. పదో తరగతి అర్హత..

|

May 29, 2022 | 9:36 AM

ఇండియన్ ఆర్మీకి చెందిన కోల్‌కతాలోని ఈస్టర్న్ కమాండ్‌ చీఫ్‌ సిగ్నల్‌ ఆఫీసర్‌ ప్రధాన కార్యాలయం (Army Eastern Command).. గ్రూప్ సీ సివిలియన్‌ - స్విచ్‌ బోర్డు ఆపరేటర్లు (సీఎస్‌బీఓ) పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన..

HQ Eastern Command Jobs 2022: ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్‌లో గ్రూప్ సీ సివిలియన్‌ ఉద్యోగాలు.. పదో తరగతి అర్హత..
Indian Army
Follow us on

HQ Eastern Command Group C CSBO Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన కోల్‌కతాలోని ఈస్టర్న్ కమాండ్‌ చీఫ్‌ సిగ్నల్‌ ఆఫీసర్‌ ప్రధాన కార్యాలయం (Army Eastern Command).. గ్రూప్ సీ సివిలియన్‌ – స్విచ్‌ బోర్డు ఆపరేటర్లు (సీఎస్‌బీఓ) పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 16

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్‌ స్విచ్‌ బోర్డు ఆపరేటర్లు (సీఎస్‌బీఓ) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 21,700తోపాటు ఇతర అలవెన్సులతోకలిపి జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పాటు ప్రైవేట్‌ ఎక్సేంజ్‌ బోర్డులో ప్రొఫిషియన్సీ, ఇంగ్లిష్‌, హిందీ ఫ్లూయంట్‌గా మాట్లాడటం వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. క్వశ్చన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Colonel Signals, HQ Eastern Command (Signals), PIN – 900285, C/o 99 APO.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.