హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీటెక్‌తో పాటు పలు టెక్నికల్ డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నోటిఫికేషన్‌లో భాగంగా ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ వంటి విభాగాల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 27 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి జీతంగా నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.6 లక్షల వరకు అందిస్తారు. అప్లికేషన్స్‌కు జూలై 19 చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు ముంబై, గుజరాత్‌లో పనిచేయాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..