HPCL Recruitment 2022: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ రిఫైనరీలో ఉన్న పలు విభాగాల్లో గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్,పెట్రోలియం ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీల ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 07-01-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నాట్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25 వేలు స్టైపెండ్ రూపంలో అందిస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీ 14-01-2022
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: కారు కొనుగోలు చేసేవారికి మారుతి సుజుకీ బంపర్ ఆఫర్
Winter Tips: చలికాలంలో బద్దకం వీడి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక పాటించాల్సిందే..
NRI News: ప్రవాస భారతీయుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అద్భుత డిపాజిట్ పథకం.. వివరాలివే!