JEE Main 2026 Preparation Tips: కోచింగ్‌ లేకుండానే జేఈఈ మెయిన్‌ 2026లో ర్యాంకు కొట్టాలా? ఈ స్మార్ట్‌ టిప్స్‌ మీ కోసమే..!

NTA JEE Mains 2026 prepration Tips: 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పొందేందుకు జేఈఈ మెయిన్‌ పరీక్షకు ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్ 27, 2025వ తేదీ వరకు కొనసాగనున్నాయి. యేటా రెండు విడతల్లో జరిగే..

JEE Main 2026 Preparation Tips: కోచింగ్‌ లేకుండానే జేఈఈ మెయిన్‌ 2026లో ర్యాంకు కొట్టాలా? ఈ స్మార్ట్‌ టిప్స్‌ మీ కోసమే..!
JEE Main 2026 Preparation Tips

Updated on: Nov 09, 2025 | 3:19 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 9: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పొందేందుకు జేఈఈ మెయిన్‌ పరీక్షకు ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్ 27, 2025వ తేదీ వరకు కొనసాగనున్నాయి. యేటా రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరువుతుంటారు. వీరిలో కేవలం 1 శాతం మందికి ఐఐటీల్లో అడ్మిషన్లు లభిస్తాయి. పోటీ తీవ్రత దృష్ట్యా పరీక్ష ప్రశ్నాపత్రం కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. అయితే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే విజయం సులువేనంటున్నారు నిపుణులు. అందుకు చక్కని ప్రిపరేషన్‌, ఓర్పు, తగినంత కృషీ అవసరం. స్మార్ట్‌ ప్రిపరేషన్‌ కోసం నిపుణులు ఈ కింది టిప్స్ సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సిలబస్‌పై పట్టు..

జేఈఈ పరీక్షకు వేగం, కచ్చితత్వం చాలా అవసరం. ప్రిపరేషన్‌ను కొనసాగిస్తూనే క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేస్తుండాలి. అయితే ఏ పోటీ పరీక్ష రాయాలన్నా ముందుగా సిలబస్‌పై పట్టు సాధించాలి. ఇది జేఈఈ మెయిన్‌కు కూడా వర్తిస్తుంది. సిలబస్‌, పరీక్షా సరళి గురించి సరైన అవగాహనతో సన్నద్ధత మొదలుపెట్టడమే విజయానికి తొలి మెట్టు ఎక్కినట్లే. ముఖ్యంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫార్ములాలను బట్టీ పట్టేబదులు.. కాన్సెప్టులపైనే దృష్టి పెట్టాలి. గత ప్రశ్నా పత్రాల ఆధారంగా జేఈఈ పరీక్షలో అడిగే ప్రశ్నల సరళిని ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ప్రతి టాపిక్‌పైనా పట్టు సాధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని లోతుగా చదవాలి. క్లిష్టమైన అంశాల అధ్యయనానికి ఇతర పుస్తకాలు చదవొచ్చు. ప్రాక్టీస్‌ టెస్టుల్లో ఎక్కడ వెనుకబడ్డారో, ఏయే పొరపాట్లు చేస్తున్నారో గుర్తించి ఆ తప్పులు పునరావృతం చేసే అవకాశాలను వీలైనంత వరకు తగ్గించుకునేలా ప్రాక్టీస్‌ చేయాలి. మీరు చదివే అంశాలను రెగ్యులర్‌గా రివిజన్‌ చేయడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

చిన్న లక్ష్యాలతో పెద్ద విజయాలు..

ఆయా సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్‌ను ఎంచుకొని వారంలో వాటిని పూర్తి చేసేలా స్వల్ప కాలిక లక్ష్యాలు పెట్టుకోవాలి. ఇలా వీక్లీ గోల్స్‌ పెట్టుకోవడం వల్ల కొండంత సిలబస్‌ను సులువుగా కంప్లీట్‌ చేయగలుగుతారు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ప్రిపరేషన్‌ సాఫీగా సాగుతుంది. అలాగే మీ టైం టేబుట్‌కు అనుగుణంగా క్విజ్‌లు వంటివి పెట్టుకొని మీకు మీరే పరీక్ష రాసుకోవాలి. తద్వారా పరీక్షల ఒత్తిడి తగ్గడంతో పాటు మీ ప్రాక్టీస్‌, ప్రిపరేషన్‌ మరింత మెరుగుపడుతుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసంతోపాటు సబ్జెక్టుపై పట్టూ ఏర్పడేందుకు ఉపయోగపడుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.