మీరు పదో తరగతి పాస్ అయ్యారా..? ఇంటర్ సర్టిఫికెట్లు వచ్చాయా..? మీ చదవులకు సంబంధించిన సర్టిఫికెట్ల భద్రంగా దాచుకోలేక పోతున్నారా..? ఎక్కడికైనా క్యారీ చేయలేక పోతున్నారా..? మీ స్టడీ సర్టిఫికెట్లను ఒకేచోట దాచుకోవడం ఇబ్బందిగా ఉందా..? ఇంటర్వ్యూలకు వెళ్తున్న సమయంలో వెంట తీసుకెళ్తే పోతాయనే భయం ఉందా..? అయితే మీరు ఇక ముందు అలాంటి భయం పెట్టుకోవల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది విద్యార్థులకు పెద్ద శుభవార్త చెప్పాలి. మీ సర్టిఫికెట్లు జాగ్రత్తగా దాచుకునేందుకు ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందు కోసం ఓ ప్రణాళికను సిద్ధం చేసింది.
అయితే తాజాగా CBSC 10 వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ సందర్భంలో ఈ- డిజిటల్ మార్క్ షీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.అంతే కాదు సర్టిఫికెట్‌ను డిజిలాకర్ డిజిలాకర్‌లో చూడవచ్చని తెలిపింది. డిజిలాకర్ అనేది భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ద్వారా ప్రారంభించిన ఒక మొబైల్ యాప్.
డిజిటల్ మార్క్ షీట్ సర్టిఫికేట్ పొందడానికి విద్యార్థులు మొదట డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో మీరు మీకు కావల్సిన విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఐటి యాక్ట్, 2000 కింద డిజిలాకర్ యాప్ చెల్లుబాటు అవుతుంది.
‘డిజిటల్ ఇండియా’ ప్రచారంలో భాగం భారత ప్రభుత్వం డిజిలాకర్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని అధికారిక వెబ్‌సైట్ https://digilocker.gov.in/ . ఈ యాప్ ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఫోన్‌లో రన్ చేయవచ్చు. ఈ యాప్‌ను వెబ్ బ్రౌజర్‌లో కూడా ఉపయోగించవచ్చు. డిజిలాకర్ యాప్ నాలుగు దశల్లో పనిచేస్తుంది. ముందుగా మీరు ఈ అప్లికేషన్‌లో మీరే నమోదు చేసుకోవాలి. రెండవ దశలో.. మీకు మీరే ధృవీకరించాలి. మూడవ దశలో మాత్రం.. మీరు మీ పత్రాలను పొందవచ్చు. నాల్గవ దశలో… సర్టిఫికెట్లను ధృవీకరించాల్సి ఉంటుంది.
CBSE Class X Digital Mark sheets and Certificates are now available in DigiLocker.
Get them now!https://t.co/tqFbo1K1mi
Digital Certificates in the ‘Issued Section’ of DigiLocker App are legally valid under IT Act, 2000. pic.twitter.com/Os1oSwZMJ4— DigiLocker (@digilocker_ind) August 3, 2021
స్కూల్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు కాకుండా ఆధార్ కార్డ్, కోవిడ్ -19 టీకా సర్టిఫికేట్, వాహనాల రిజిస్ట్రేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సౌకర్యాలు డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ యాప్‌లో SSC మార్క్ షీట్, HSC మార్క్ షీట్, రేషన్ కార్డ్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రంతోపాటు మీ జాతక చక్రం సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చు. DigiLocker మీ అన్ని ప్రామాణికమైన పత్రాలను పొందగల ఒక రకమైన ఖాతాను అందిస్తుంది. మీ ముఖ్యమైన పత్రాలన్నీ ఈ లాకర్‌లో ఉంచవచ్చు. ఈ యాప్ ఖాతాలో 1GB స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. దీనిలో మీ అన్ని డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన కాపీలను స్టోర్ చేయవచ్చు.
డిజిలాకర్‌ను ఉపయోగించడానికి ముందుగా ఖాతాదారు తమ ఆధార్ నంబర్‌ను అందించాలి. ఈ యాప్ (ఇది వెబ్ బ్రౌజర్‌లో డిజిలాకర్ ఖాతా) ఆధార్ నంబర్ నమోదు చేసినప్పుడు మాత్రమే సైన్ అప్ చేయబడుతుంది. ఇందులో ఆధార్‌తో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. దీనిని డిజిలాకర్‌లో నమోదు చేయాలి. ఈ యాప్ బీటా వెర్షన్‌లో పనిచేస్తుంది. ప్రారంభంలో ఇది 100MB స్పేస్‌తో లాంచ్ చేయబడింది. ఆ తరువాత 1GB కి పెరిగింది. మీరు డిజిలాకర్‌లో ఏ ఫైల్‌ను అప్‌లోడ్ చేసినా.. దాని పరిమాణం 10MB ని మించకూడదు.
2016 సంవత్సరంలో డిజిలాకర్‌లో 20.13 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. 24.13 లక్షల డాక్యుమెంట్లు ఇందులో డిపాజిట్ చేయబడ్డాయి. తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని మునిసిపల్ సంస్థలకు డిజిలాకర్‌ను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఖాతాదారుల సంఖ్యలో పెద్ద పెరుగుదలను చూసింది.
ఇవి కూడా చదవండి: Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..