Education Loan: అతి తక్కువ వడ్డీతో ఈజీగా విద్యారుణం కావాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..

| Edited By: Shaik Madar Saheb

Apr 09, 2023 | 8:30 AM

బ్యాంకర్లు అంత సులువుగా ఎడ్యూకేషన్ లోన్లు మంజూరు చేయడం లేదు. ష్యూరిటీ అడుగుతున్నాయి. అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. అభ్యర్థుల క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సులభంగా ఎడ్యూకేషన్ లోన్ పొందడం ఎలా?

Education Loan: అతి తక్కువ వడ్డీతో ఈజీగా విద్యారుణం కావాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
Education Loan
Follow us on

ప్రస్తుత కాలంలో నాణ్యమైన చదువు కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఒకరకంగా చదువు కొనాల్సిన దుస్థితి అని చెప్పడం కూడా సబబే అవుతుందేమో! ముఖ్యంగా ఉన్నత చదువులు అభ్యసించడం ఆస్తులను అమ్ముకునేలా చేస్తోంది. అది కూడా విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే బ్యాంకులు అందించే ఎడ్యూకేషన్ లోన్లు బాగా ఉపకరిస్తున్నాయి. ఇవి తీసుకోవడం విద్యార్థులకు అనివార్యమవుతోంది. విద్యా రుణాలు పొందడం ద్వారా సెక్షన్ 80(E) కింద ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు పలు ప్రయోజనాలు కూడా ఉండటంతో అందరూ విద్యారుణాలవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే బ్యాంకర్లు అంత సులువుగా ఎడ్యూకేషన్ లోన్లు మంజూరు చేయడం లేదు. ష్యూరిటీ అడుగుతున్నాయి. అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. అభ్యర్థుల క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సులభంగా ఎడ్యూకేషన్ లోన్ పొందడం ఎలా? తక్కువ వడ్డీ రేటుకు లోన్ తీసుకోవడం ఎలా? అందుకు ఎటువంటి నియమాలు, నిబంధనలు ఉంటాయి? మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

క్రెడిట్ స్కోర్ అవసరం.. ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్‌ అవసరం. బ్యాంకులు ఎలాంటి రుణం ఇవ్వాలన్నా ముందు క్రెడిట్ స్కోర్‌నే పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది మీ లావాదేవీలు, పాత లోన్లు చెల్లించిన విధానం ఆధారంగా మారుతుంటుంది. సాధారణంగా లోన్ తీసుకొని సకాలంలో చెల్లించిన వారి క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి విద్యా రుణం త్వరగా లభిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నా లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి ఎప్పుడైనా లోన్ తీసుకున్నా, మీకు ఇప్పటికే క్రెడిట్ స్కోర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే బ్యాంకర్లు మీకు సులభంగా లోన్లు మంజూరు చేస్తాయి. ఎందుకంటే మీరు సకాలంలో విద్యా రుణాన్ని తిరిగి చెల్లిస్తారనే నమ్మకం బ్యాంకులకు కలుగుతుంది. మీకు మంచి క్రెడిట్ హిస్టరీ లేకుంటే, రుణాన్ని పొందే అవకాశాలను పెంచుకోవడానికి మీతో పాటు మరొకరు రుణంపై సంతకం చేయాల్సి రావచ్చు.

పేరున్న కాలేజీలకే ప్రాధాన్యం.. ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసే ముందు పేరున్న కాలేజీ లేదా యూనివర్సిటీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రుణదాత పేరున్న ఇన్‌స్టిట్యూట్‌కు లోన్ ఇవ్వడానికి పెద్దగా ఆలోచించరు. అదే మీరు అంతగా పేరు లేని లేదా అసలు ఎవరికీ తెలియని యూనివర్సిటీని ఎంచుకుంటే.. లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు. లేదంటే రుణదాత రుణానికి వ్యతిరేకంగా అధిక విలువ ఉన్న ఆస్తిని తనఖా పెట్టమని అడగవచ్చు. లేదా సెక్యూరిటీని డిమాండ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

వడ్డీ రేటు చూసుకోవాలి.. ఎడ్యూకేషన్ లోన్ కి అప్లై చేసేముందు ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు, రీపేమెంట్ నిబంధనలను పరిశీలించుకోవాలి. తొందరపడకూడదు. అప్పుడు లోన్ అధిక భారం కాకుండా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..