Health Department Recruitment 2023: కేంద్ర ఆరోగ్య శాఖలో 487 ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన వివరాలు ఇవే

|

Nov 15, 2023 | 9:52 PM

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 487 పోస్టులను ఆయా ఆరోగ్యకేంద్రాల్లో భర్త చేయనున్నారు. రిసెర్చ్‌ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్..

Health Department Recruitment 2023: కేంద్ర ఆరోగ్య శాఖలో 487 ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన వివరాలు ఇవే
Health Department Recruitment 2023
Follow us on

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 487 పోస్టులను ఆయా ఆరోగ్యకేంద్రాల్లో భర్త చేయనున్నారు. రిసెర్చ్‌ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్, ఫీల్డ్‌ వర్కర్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, ఎక్స్‌రే టెక్నీషియన్, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్‌ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌), పారామెడికల్‌ వర్కర్, వర్క్‌షాప్‌ అటెండెంట్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు ఏం ఉండాలంటే..

  • హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు మొత్తం 70 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌/ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌/ శానిటరీ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా పన్నెండో తరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌/ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌/ శానిటరీ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమాలో పాసై ఉండాలి. అలాగే రెండేళ్ల ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
  • ఫీల్డ్‌ వర్కర్‌ పోస్టులు మొత్తం 140 వరకు ఉన్నాయి. పదోతరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి.
  • ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులు మొత్తం 69 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి పాసవ్వాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిక్స్‌/యానిమల్‌ కేర్‌/ల్యాబొరేటరీ యానిమల్‌ కేర్‌/ప్రొడక్షన్‌ ఆఫ్‌ ఇమ్యునొబయలాజికల్‌ అండ్‌ యానిమల్‌ కేర్‌/వెటరినరీ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఏడాది ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేదా ఏడాది డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
  • నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు 16 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వాలి లేదా జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ డిప్లొమా చేసి రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్‌ అయ్యి ఉండాలి. 50 పడకల హాస్పిటల్‌లో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద రూ.600 ప్రతిఒక్కరూ చెల్లించాలి. మహిళలకు, ఎసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

పరీక్ష విధానం..

ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకూ 4 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్‌ 30, 2023.
  • ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: డిసెంబర్ 01, 2023.
  • అడ్మిట్‌కార్డ్‌ డౌన్‌లోడింగ్‌ తేదీ: డిసెంబరు మొదటివారం, 2023 నుంచి
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబరు రెండోవారం, 2023లో ఉంటుంది.
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీ: డిసెంబరు నాలుగోవారం, 2023లో ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.