HAL School Jobs: హైదరాబాద్‌ హాల్‌ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

|

Mar 21, 2022 | 8:28 AM

HAL Secondary School Recruitment: హాల్‌ సెకండరీ స్కూల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని స్కూల్‌లో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ , నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

HAL School Jobs: హైదరాబాద్‌ హాల్‌ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Hal School Jobs
Follow us on

HAL Secondary School Recruitment: హాల్‌ సెకండరీ స్కూల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని స్కూల్‌లో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ , నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ) – 04, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ–సైన్స్‌) – 01, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ–సోషల్‌ సైన్స్‌) – 01, డ్యాన్స్‌ టీచర్‌ – 01, మ్యూజిక్‌ టీచర్‌ – 01, కౌన్సిలర్‌ – 01, అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ క్లర్క్‌ – 01, నర్సరీ టీచర్‌ – 01, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఆర్‌టీ–ఫిమేల్‌) – 01, ఐటీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ – 01 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సెంట్రల్‌/స్టేట్‌ లెవల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అర్హత ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, ఇంగ్లిష్‌లో స్పష్టంగా మాట్లాడగలగాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది ప్రిన్సిపల్,హాల్‌ సె కండరీ స్కూల్,హాల్‌ టౌన్‌షిప్,బాలానగర్, హై దరాబాద్‌–500042 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 19,000 నుంచి రూ. 22,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 22-03-2022ని చివరి తేదీగి నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: AP Inter Exams: పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ ఇంటర్‌ బోర్డ్‌.. పూర్తి వివరాలు..

Raashi Khanna: అలాంటి స్ర్కిప్ట్‌లకు దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాశీఖన్నా..

Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!