Staff Nurse Posts In Guntur Govt Hospital: కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు సన్నాహాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైద్య సిబ్బందిని పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇప్పటకే పలు ప్రభుత్వ రంగ సంస్థలు వైద్య ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు సమగ్ర వైద్య శాలలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో స్టాఫ్ నర్సులతో పాటు పలు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
* ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 300 స్టాఫ్ నర్సులతో పాటు, అనిస్థీషియా టెక్నిషియన్స్ 20, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు ఆరు నెలల కాంట్రాక్టు విధానంలో తీసుకోనున్నారు.
* ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నేడు (08-05-2021 శనివారం) ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ విద్యార్హత జిరాక్స్ సెట్‌తో సూపరింటెండెట్, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read: కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతుందా..? ఈ సమస్య అందరికి వస్తుందా..! తెలుసుకోండి..
SDM జాబ్ గురించి మీకు తెలుసా..? జీతం ఎంత వస్తుంది..! సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు..