GPAT 2022 Date: జీప్యాట్‌ 2022 ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీ విడుదల.. పరీక్ష తేదీ ఇదే..

|

Mar 11, 2022 | 7:05 AM

గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GPAT) 2022 ఎగ్జాం తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (మార్చి 10) ప్రకటించింది. ఎంఫార్మా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే..

GPAT 2022 Date: జీప్యాట్‌ 2022 ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీ విడుదల.. పరీక్ష తేదీ ఇదే..
Gpat 2022
Follow us on

NTA GPAT 2022 exam date, schedule announced: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GPAT) 2022 ఎగ్జాం తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (మార్చి 10) ప్రకటించింది. ఎంఫార్మా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రనన్స్‌ టెస్ట్‌ వచ్చేనెల (ఏప్రిల్) 9న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు వెల్లడించింది. జీప్యాట్‌ 2022 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in/ లేదా gpat.nta.nic.in/ని సందర్శించాలని ఎన్టీఏ విద్యార్ధులకు సూచించింది. అలాగే విద్యార్ధుల సందేహాల నివృతికి ఎన్టీఏ హెల్ప్ డెస్క్‌కు 011 40759000 లేదా 011 69227700 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు లేదా ఈ మెయిల్‌ gpat@nta.ac.in ద్వారా కూడా సంప్రదించొచ్చని పేర్కొంది. కాగా జీప్యాట్‌ క్వశ్యన్‌ పేపర్‌లో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ వంటి అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలుకోరే విద్యార్ధులు పరీక్షా సరళిని అర్థం చేసుకోవడానికి ఎన్టీఏ నిర్వహించే జీప్యాట్‌ మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్‌ చేయవచ్చు. జీప్యాట్‌లో సాధించిన స్కోర్ ద్వారా AICTE- అప్రూవ్డ్‌ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీలు, కాన్‌స్టిట్యూట్‌ కాలేజీలు, ఇతర అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందడానికి ఉపయోగపడుతుంది.

Also Read:

Women’s Day 2022: ఉద్యోగాల్లో లింగ అసమానత.. మెటర్నిటీ లీవ్‌ తర్వాత మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు!