Disabled Students : దివ్యాంగులకు గుడ్‌న్యూస్..! మూడేళ్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన NCPEDP.. మరిన్ని వివరాలు తెలుసుకోండి..

Disabled Students : దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్

Disabled Students : దివ్యాంగులకు గుడ్‌న్యూస్..! మూడేళ్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన NCPEDP.. మరిన్ని వివరాలు తెలుసుకోండి..
Disabled Students

Updated on: Jun 12, 2021 | 7:48 PM

Disabled Students : దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసబుల్‌డ్ పీపుల్ (ఎన్‌సిపిఈడిపి). అభివృద్ధి రంగంలో తమ వృత్తిని కొనసాగించడానికి శనివారం దివ్యాంగ యువకులకు మూడేళ్ల స్కాలర్‌షిప్ ప్రకటించింది. ఈ చొరవ కోసం ఎన్‌సిపిఈడిపి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఈ స్కాలర్‌షిప్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని ఎన్జీఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన తర్వాత దివ్యాంగ విద్యార్థులకు చాలా ఉపశమనం లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్- ncpedp.org ని సందర్శించండి.

దివంగత జావేద్ అబిడి జ్ఞాపకార్థం..
భారతదేశంలో దివ్యాంగుల కోసం ఉద్యమం చేసిన జావేద్ అబిడి జ్ఞాపకార్థం ఎన్‌సిపిఇడిపి జావేద్ అబిడి ఫెలోషిప్‌ను అందిస్తోంది.18 నుంచి 28 ఏళ్లలోపు వైకల్యం ఉన్నవారికి, దివ్యాంగుల సమస్యలపై ఆసక్తి ఉన్నవారికి, అభివృద్ధి రంగంలో, ముఖ్యంగా హక్కుల కోసం వృత్తిని కొనసాగించాలని కోరుకునే వారికి మూడేళ్ల స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. వైకల్యాలున్న వ్యక్తులను చేర్చడం కోసం, స్కాలర్‌షిప్ అందుకున్న వ్యక్తి అవసరాలను తీర్చడానికి ప్రతి నెలా 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వబడుతుంది.

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి అవకాశాల కోసం రెండు దశాబ్దాలుగా దివ్యాంగులు పోరాటం చేస్తున్నారు. ఇటువంటి ఫెలోషిప్‌లు దివ్యాంగులకు భరోసానివ్వటంతో పాటుగా వారి హక్కుల కోసం పోరాడే శక్తిని కల్పిస్తాయి. అంతేకాకుండా వారి అభ్యాసాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

భారత్ నుంచి 1300 సిమ్ కార్డులను చైనాకు చేరవేసిన ‘గూఢచారి’ అరెస్ట్…..బెంగాల్ పోలీసులకు అప్పగింత

Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం.. చైనా బండారం బయటపెట్టినందుకు..

Inter Students : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీ..! తక్కువ రోజులలో ఎక్కువ బెనిఫిట్..