GATE 2025 Edit Option: గేట్‌ 2025 దరఖాస్తులో మార్పులకు అప్లికేషన్‌ విండో ఓపెన్‌.. ఇంతకీ పరీక్ష ఎప్పుడంటే

|

Nov 04, 2024 | 7:00 AM

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 పరీక్షకు ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ముగిశాయి. అయితే దరఖాస్తు సమయంలో ఏవైనా పొరబాట్లు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి అప్లికేషన్ విండ్ మళ్లీ ఓపెన్ అయ్యింది. ఈ మేరకు సవరణలు చేసుకోవాలని ఐఐటీ రూర్కీ ప్రకటన విడుదల చేసింది..

GATE 2025 Edit Option: గేట్‌ 2025 దరఖాస్తులో మార్పులకు అప్లికేషన్‌ విండో ఓపెన్‌.. ఇంతకీ పరీక్ష ఎప్పుడంటే
GATE 2025 Edit Option
Follow us on

హైదరాబాద్, నవంబర్‌ 4: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. గేట్‌ దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులు చోటు చేసుకుని ఉంటే అటువంటి వారు తమ వివరాలు సవరించు కోవడానికి అవకాశం లభించింది. ఈ మేరకు దరఖాస్తు సవరణ చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ వెల్లడించింది. నిర్ణీత ఫీజు చెల్లించి అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఎగ్జామ్‌ సిటీ, జెండర్‌ తదితర విషయాల్లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ అవకాశం నవంబర్‌ 10వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ముగింపు సమయంలోపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఐటీ రూర్కీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా గేట్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 11వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే గేట్‌ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు నేరుగా కల్పిస్తాయి.

గేట్‌ 2025 దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

నవంబర్‌ 19, 20 తేదీల్లో సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్‌ నైపుణ్య పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 5, వీఆర్వో-గ్రేడ్‌ 1, 2, ఇతర ఉద్యోగులకు కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని నవంబరు 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా ఓ ప్రకటన జారీచేసింది.

ఇవి కూడా చదవండి

నవంబర్‌ 9వ తేదీన ఐబీపీఎస్‌ ఎస్‌వో ప్రిలిమ్స్‌ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌-XIV) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్‌ అడ్మిట్‌కార్డులను IBPS విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి, అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నవంబర్‌ 9వ తేదీన ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఫలితాలు డిసెంబరులో విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 896 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఐబీపీఎస్‌ ఎస్‌వో ప్రిలిమ్స్‌ కాల్‌ లెటర్ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.