GATE 2022 Toppers: ఈ ఏడాది గేట్‌ 2022లో టాప్‌ ర్యాంక్‌లు సాధించిన టాపర్లు వీరే..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలు నేడు (మార్చి 17) విడుదలయ్యాయి. ఈ ఏడాదికి గేట్ 2022 టాపర్‌గా..

GATE 2022 Toppers: ఈ ఏడాది గేట్‌ 2022లో టాప్‌ ర్యాంక్‌లు సాధించిన టాపర్లు వీరే..
Gate 2022 Toppers

Updated on: Mar 17, 2022 | 1:22 PM

GATE 2022 Toppers List Released: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలు నేడు (మార్చి 17) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సూట్‌ gate.iitkgpలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన స్కోర్‌కార్డులను మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్‌, పాస్‌వర్డ్ లేదా ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. గేట్‌ ఫలితాల (GATE 2022 Results)తో పాటు ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది ఐఐటీ ఖరగ్‌పూర్. కాగా గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలు ఐఐటీ ఖరగ్‌పూర్‌ నేడు విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన వారు గేట్ 2022 టాపర్‌లుగా నిలుస్తారు. ఇక ఈ ఏడాదికి గేట్ 2022 మెకానికల్ పేపర్‌లో నిఖిల్ సాహా (Nikhil Saha) టాపర్‌గా నిలిచాడు. కంప్యూటర్ సైన్స్ (సీఎస్) పేపర్‌లో అభినవ్ గార్గ్ (Abhinav Garg) ఫస్ట్‌ ర్యాంక్ సాధించాడు.

గేట్ 2022లో సబ్జెక్టుల వారీగా ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించాన టాపర్లు వీరే..

  • గేట్‌ కంప్యూటర్ సైన్స్ టాపర్‌ 2022- అభినవ్ గార్గ్
  • గేట్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ టాపర్‌ 2022- గౌరవ్‌
  • గేట్ ఎన్విరాన్‌మెంట్ టాపర్‌ 2022- సౌరవ్‌ సింగ్‌ యాదవ్‌
  • గేట్‌ మెకానికల్‌ టాపర్‌ 2022- నిఖిల్‌ సాహ

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష.. ఇంజనీరింగ్, సైన్స్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్లకు కూడా గేట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది.

Also Read:

HAL Recruitment 2022: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..