Gate Exam: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్షను వచ్చే ఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. ఇప్పటి వరకు గేట్ నిర్వహణ బాధ్యతను ఐఐటీ ముంబయి చూసుకోగా.. తాజాగా సదరు బాధ్యతలను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుంచి నిర్వహించనున్న పరీక్ష పేపర్‌లో పలు మార్పులు చేర్పులు చేశారు.
ఇందులో భాగంగానే రెండు కొత్త పేపర్లను చేర్చాలని ఎన్‌సీబీ నిర్ణయించింది. ప్రస్తుతం 27 సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తుండగా.. వచ్చే ఏడాది రెండు కొత్త పేపర్లను చేర్చనున్నారు. నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్‌ను ఒక పేపర్‌గా.. జియోమాటిక్స్ ఇంజనీరింగ్‌ను రెండవ పేపర్‌గా చేర్చనున్నారు. ఇక వీటితోపాటు హ్యుమానిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ చేర్చారు. అంతేకాకుండా.. ప్రతి ఏటా గేట్ పరీక్షకు హాజరవుతోన్న వారి సంఖ్య పెరుగుతుండడంతో 2022లో నిర్వహించే పరీక్షకు కేంద్రాల సంఖ్యను పెంచే యోచనలోఉన్నారు. గేట్ పరీక్షను కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నిర్వహించే గేట్ పరీక్షకు కన్వీనర్‌గా ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ తివారీగా వ్యవహరించనున్నారు.
Mysterious Train : “దెయ్యం రైలు”…సొరంగంలోకి వెళ్లిన ఆ రైలు ఎక్కడికి వెళ్లినట్టు.. ఏమైనట్టు..