GAIL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గెయిల్

GAIL Recruitment 2021:సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజయింది. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ..

GAIL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గెయిల్
Gail Requitment

Edited By: Surya Kala

Updated on: Jul 13, 2021 | 8:49 AM

GAIL Recruitment 2021: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజయింది. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. న్యూ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌లో వివిధ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గెయిల్ సంస్థ మొత్తం 220 పోస్టులను భర్తీ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 ఆగస్టు 5 వతేదీ. దరఖాస్తు చేసేందుకు, ఇతర వివరాలకు https://www.gailonline.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ విభాగాల్లో అర్హులు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

అర్హత:

మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ఆర్, లా విభాగాల్లో డిగ్రీ చదివిన వారు, ఇంజనీరింగి డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు అర్హులు. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవముండాలి.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల్ని గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Also Read: కార్తీక్ తనకు అన్యాయం చేశాడని పోలీస్ ఆఫీసర్ కు కంప్లైంట్ ఇచ్చిన మోనిత.. న్యాయం మాత్రమే చేయండి అంటున్న దీప

పాకిస్థాన్‌లో ఓ వైపు కరోనా వైరస్ నాలుగో వేవ్.. భారీగా కేసులు.. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన అధికారులు