FTII Faculty Recruitment 2022: పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) వివిధ విభాగాల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల (Teaching And Non Teaching posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ఖాళీల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సౌండ్ రికార్డిస్ట్, మెడికల్ ఆఫీసర్లు.
విభాగాలు: ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్, ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఐటీ మేనేజర్, అకడమిక్ కో ఆర్డినేటర్, ఫిల్మ్ రీసెర్చ్ ఆఫీసర్, సౌండ్ రికార్డిస్ట్, బీఏఎంఎస్ తదితర విభాగాల్లో ఖాళీలను పూరించనున్నారు.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.1,16,398ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 63 ఏళ్లు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ, బీఏఎంఎస్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవంతోపాటు, టెక్నికల్ నైనుణ్యాలు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 8 నుంచి ఏప్రిల్ 13 వరకు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: