
సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ప్రవేశాలు పొందండి. 2025-26 విద్యాసంవత్సరానికి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA), ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ FTII నోటిఫికేషన్ విడుదల చేసింది. నటన మాత్రమే కాదు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ రైటింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు ఉంటాయి. అందుకు ఎఫ్‌టీఐఐ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.
ఎంఎఫ్‌ఏ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ఉండాలి. ఆర్ట్ డిజైన్ కోర్సుకు ఫైన్స్ ఆర్ట్స్ సంబంధిత బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏడాది పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు. అయితే ప్రవేశ సమయం నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా జూలై 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఒక్కో కోర్సుకు జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులైతే రూ.500 ఫీజు ఉంటుంది. రెండు కోర్సులకైతే వరుసగా రూ.2500, రూ.800 చెల్లించాలి. స్టేజ్-1 రాత పరీక్ష, స్టేజ్-2 అభినయం/ ప్రాక్టికల్/ ఇంటరాక్షన్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.