భారత రాజ్యాంగం గురించి వాస్తవాలు.. 15 ప్రత్యేక విషయాలు తెలుసుకోండి..

|

Nov 26, 2021 | 3:24 PM

Constitution Day 2021: నేడు రాజ్యాంగ దినోత్సవం. ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటుంది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న

భారత రాజ్యాంగం గురించి వాస్తవాలు.. 15 ప్రత్యేక విషయాలు తెలుసుకోండి..
Indian Constitution
Follow us on

Constitution Day 2021: నేడు రాజ్యాంగ దినోత్సవం. ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటుంది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. కానీ ఇది మొదటిసారిగా 26 నవంబర్ 1949న అధికారికంగా ఆమోదించబడింది. అందుకే భారతదేశంలో నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజునే నేషనల్ లా డే అని కూడా అంటారు. రాజ్యాంగంలోని 15 ప్రత్యేక విషయాల గురించి తెలుసుకుందాం.

1. నిజానికి భారత రాజ్యాంగం హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో రాశారు.
2. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది.
3. భారత రాజ్యాంగం ఇంగ్లీష్‌ సంస్కరణలో మొత్తం117,369 పదాలు ఉన్నాయి.
4. భారత రాజ్యాంగం అసలు కాపీ చేతితో రాశారు. భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా (భారతీయ కాలిగ్రాఫర్) ఇటాలిక్ శైలిలో రాశారు.
5. భారత రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు.
6. భారత రాజ్యాంగం అసలు ప్రతిని హీలియం వాయువుతో నింపిన గాజు పెట్టెలో భారత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ లైబ్రరీలో ఉంచారు.
7. భారత రాజ్యాంగం మొదటి ముసాయిదా ఖరారు కాకముందే దాదాపు 2000 సవరణలు జరిగాయి.
8. భారత రాజ్యాంగ పీఠికలో 1976లో ఎమర్జెన్సీ సమయంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే రెండు పదాలను చేర్చారు.
9. భారత రాజ్యాంగంలో 25 భాగాలలో మొత్తం 470 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి.
10. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం.
11. భారత రాజ్యాంగ పితామహుడిని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అంటారు. గవర్నర్‌కు మరింత అధికారం కల్పించేందుకు రాజ్యాంగ సవరణకు ఆయన సానుకూలంగా స్పందించారు.
12. భారత రాజ్యాంగాన్ని ‘బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్’ అని కూడా అంటారు. ఎందుకంటే దానిలోని చాలా నిబంధనలు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, ఐర్లాండ్‌తో సహా ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి ప్రేరణ పొందాయి.
13. భారత రాజ్యాంగ సభలో మొత్తం 284 మంది సభ్యులు ఉండగా అందులో 15 మంది మహిళలు ఉన్నారు.
14. భారత రాజ్యాంగ ప్రవేశిక US రాజ్యాంగం ఉపోద్ఘాతం నుంచి ప్రేరణ పొందింది.
15. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. 1950 నుంచి ఇప్పటివరకు 105 సవరణలు చేశారు.

భూమిపై ఈ ద్వీపం ఒక అద్భుతం.. ఇక్కడి పర్వతాలను ప్రజలు తింటారు కూడా..?

Kidney Disease: కిడ్నీ వ్యాధుల రోగులు పెరుగుతున్నారు..! లక్షణాలు వెంటనే గుర్తించండి..

పారామిలటరీ దళాల ఎక్స్‌గ్రేషియా పెంపు.. అమరవీరుల కుటుంబాలకు రూ.35 లక్షలు.. ఇంకా ఈ ప్రయోజనాలు..