వచ్చే మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలే.. పరీక్షలు. పోటీపరీక్షలు ఓ వైపు.. అకడమిక్ పరీక్షలు మరోవైపు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తికాగా.. రెండు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు జరగనుండగా.. అటు తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అటు తెలంగాణలోనూ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షల మూల్యాంకనం మొత్తం 4 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి విడత కింద ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను మార్చి 16తో మూల్యాంకనం పూర్తి చేశారు. మార్చి 20 నుంచి రెండో విడతలో ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులను మూల్యాంకనం చేస్తారు. మార్చి 22 నుంచి మూడో విడతలలో కెమిస్ట్రీ, కామర్స్‌తను, మార్చి 24 నుంచి నాలుగో విడతలో చరిత్ర, బోటనీ, జువాలజీ జవాబు పత్రాలు మూల్యాకనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తైతే ఆ వెనువెంటనే ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. ఇక ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే ఆయా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏ రోజున ఏయే పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీకోసం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.