ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. అర్హులెవరంటే..

|

Oct 19, 2022 | 6:55 AM

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. అర్హులెవరంటే..
ESIC Faridabad
Follow us on

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 84 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్ (9), అసోసియేట్ ప్రొఫెసర్ (27), అసిస్టెంట్ ప్రొఫెసర్ (48) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్/పీజీ/ఎండి/ఎం ఎస్ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్‌ అర్హత, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూను అక్టోబర్‌ 27వ తేదీన నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..