ESIC Hyderabad Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC Sanatnagar).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల (Teacher Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు
ఖాళీల వివరాలు:
విభాగాలు: రేడియాలజీ, ఇమ్యూనో హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేషన్, అనాటమీ, ఫిజియాలజీ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.1,30,797ల నుంచి రూ.2,78,595ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
ఇంటర్వ్యూ తేదీ: జులై 18, 2022.
అడ్రస్: ESICMedical College Sanathnagar, Hyderabad-500038.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.