ESIC Chennai: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నై రాష్ట్రంలోని కేకే నగర్‌లోనున్న ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. 61 సీనియర్‌ రెసిడెంట్‌, చైల్డ్‌ సైకాలజిస్ట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

ESIC Chennai: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
ESIC New Delhi Recruitment 2022

Updated on: Oct 24, 2022 | 10:48 AM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నై రాష్ట్రంలోని కేకే నగర్‌లోనున్న ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. 61 సీనియర్‌ రెసిడెంట్‌, చైల్డ్‌ సైకాలజిస్ట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనాటమీ, సైకాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్‌, టీబీ, డెర్మటాజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆప్తల్మాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 21 నుంచి 67 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 2, 4, 5, 2022వ తేదీల్లో ఉదయం 9 గంటలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. ఐతే జనరల్ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.47,838ల నుంచి రూ,1,30,797ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The office of Dean, ESIC Medical College & Hospital, Ashok Pillar Road, K.K. Nagar, Chennai

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.