Engineering courses: ఇక చదివేయండి.. ఇంగ్లీష్‌లో కాదు.. తెలుగులో కూడా బీటెక్‌..

|

Jul 18, 2021 | 9:43 AM

ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రాంతీయ భాషల్లో చదవచ్చు. ఈ మేరకు కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల...

Engineering courses: ఇక చదివేయండి.. ఇంగ్లీష్‌లో కాదు.. తెలుగులో కూడా బీటెక్‌..
Engineering
Follow us on

ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రాంతీయ భాషల్లో చదవచ్చు. ఈ మేరకు కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) అనుమతిచ్చింది. తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు  AICTE అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈమేరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ ఆమోదించింది. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ నిబద్ధతతో ఉన్నారని మంత్రి ప్రధాన్‌ వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు.

మొదటి దశలో ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కోర్సులను బోధించనున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్‌ కోర్సులను ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నది. మొత్తం 11 భాషల్లోకి కోర్సులను ట్రాన్సిలెట్ చేస్తున్నారు. భాష కారణంగా ఏ విద్యార్థి కూడా తాను కోరుకొన్న చదువుకు దూరం కాకూడదని.. ఇంజనీరింగ్‌ సహా అన్ని ఉన్నత విద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించాలని జాతీయ విద్యా విధానంలో(NEP) పేర్కొన్నారు.

ఈ ఏడాది మొదట్లో ఏఐసీటీఈ సర్వే నిర్వహించగా దాదాపు సగం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు తాము మాతృభాషలో చదవాలని అనుకొంటున్నట్టు చెప్పారు. అనంతరం ప్రాంతీయభాషలో ఇంజనీరింగ్‌ కోర్సుల బోధనపై ప్రొఫెసర్‌ ప్రేమ్‌ విరాట్‌ అధ్యక్షతన కమిటీ వేశారు. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఏఐసీటీఈ అనుబంధ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఎంచుకోవడానికి విద్యార్థులకు ఆప్షన్‌ ఉండాలని ఈ కమిటీ సూచించింది.

ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో 14 కాలేజీలు ఆసక్తిచూపాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతినిచ్చింది. విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో కోర్సులు చేస్తున్నప్పటికీ ఈ నాలుగేండ్లు వారికి ఇంగ్లిషు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. ఫ్యాకల్టీని బట్టి కాలేజీలు భిన్న భాషల్లో కోర్సులను అందించవచ్చు. ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించాలంటే కాలేజీకి ఎన్‌బీఏ గుర్తింపు ఉండాలి.

ఇవి కూడా చదవండి: viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..