ECIL Hyderabad Jobs: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Feb 23, 2022 | 9:48 AM

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రదాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

ECIL Hyderabad Jobs: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Ecil
Follow us on

ECIL Scientific Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రదాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు మైసూర్‌ (Mysuru)లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 19

పోస్టుల వివరాలు:

  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (కెమికల్‌): 4

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనవర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో బీఎస్సీ/ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా పది తర్వాత 3 ఏళ్ల వ్యవధి కలిగిన డిప్లొమా (కెమికల్‌) కోర్సు పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.21,270లు జీతంగా చెల్లిస్తారు.

  • జూనియర్‌ ఆర్టిజన్‌: 15

విభాగాలు: ఎలక్ట్రికల్‌, కెమికల్ ప్లాంట్‌ ఆపరేటర్‌

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.19,324లు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఐటీఐ/ఎమ్‌పీసీలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చు.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 12, 13 తేదీల్లో కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

అడ్రస్‌: Project Office cum Transit Accommodation, Bhabha Atomic Research Center, 8th Main Road, Defence Layout, In front of Regency Public school, Vidyaranyapura, Bengaluru – 560097.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Technical Officer Jobs: బీఈ/బీటెక్‌ అర్హతతో హైదరాబాద్‌ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు.. నెలకు 63 వేల జీతం..