ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
* అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు 15-12-2022ని చవరి తేదీగా నిర్ణయించారు.
* తుది మెరిట్ జాబితాను 19-12-2022 తేదీన వెల్లడిస్తారు. నియామక ఉత్తర్వుల జారీని 23-12-2022 తేదీన ప్రకటిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..