Digital India Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీల్లోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ (DIC).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన..

Digital India Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!
Digital India

Updated on: Mar 09, 2022 | 9:01 AM

Digital India Corporation Manager Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీల్లోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ (DIC).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టులు:

  • ప్రోగ్రాం డైరెక్టర్‌ పోస్టులు: 1
  • పోర్టర్‌ డైరెక్టర్‌ పోస్టులు: 1
  • ఫైనాన్స్‌ మేనేజర్‌ పోస్టులు: 1
  • మార్కెటింగ్‌ మేనేజర్‌ పోస్టులు: 2
  • ప్రోగ్రాం మేనేజర్‌ పోస్టులు: 5
  • ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులు: 1
  • పోర్టర్‌ మేనేజర్‌ పోస్టులు: 1
  • ఫైనాన్స్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులు: 1
  • అడ్మిన్‌ స్టాఫ్‌ పోస్టులు: 2

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Mumbai Jobs : ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగాఉన్నారా? నెలకు లక్షకు పైగా జీతంతో ఐఐటీ ముంబాయిలో ఉద్యోగాలు..