NABARD Recruitment: చివరి అవకాశం.. నాబార్డు ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..

ప్రముఖ జాతీయ వ్యవసాయ రంగ బ్యాంక్‌ అయిన నాబార్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు

NABARD Recruitment: చివరి అవకాశం.. నాబార్డు ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
Nabard Jobs

Updated on: Oct 10, 2022 | 10:43 AM

ప్రముఖ జాతీయ వ్యవసాయ రంగ బ్యాంక్‌ అయిన నాబార్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (10-10-2022) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 177 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ (173), డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌(హిందీ) (04) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-09-2022 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 32,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 15-09-2022న మొదలవగా 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..