AMD Recruitment: పదో తరగతి పూర్తి చేస్తే చాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Oct 29, 2022 | 3:51 PM

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్‌ రిసెర్చ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లు/ కేంద్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం..

AMD Recruitment: పదో తరగతి పూర్తి చేస్తే చాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Amd Recruitment
Follow us on

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్‌ రిసెర్చ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లు/ కేంద్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 274 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 274 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (జేటీవో) (09), అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏఎస్‌వో) (38), సెక్యూరిటీ గార్డు (274) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* జేటీవో పోస్టులకు దరఖాస్తు చేసుకునే 18 నుంచి 28 ఏళ్లు, మిగిలన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా లెవల్-1(రాత పరీక్ష), లెవల్-2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* సెక్యూరిటీ గార్డు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,000 ఇతర పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 35,400 చెల్లిస్తారు.

* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

* 29-10-2022న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-11-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..