Delhi University Recruitment 2022: ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలోని రామ్‌లాల్‌ ఆనంద్‌ కాలేజ్‌.. 73 టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Delhi University Recruitment 2022: ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
Delhi University

Updated on: Sep 19, 2022 | 7:21 AM

Delhi University Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలోని రామ్‌లాల్‌ ఆనంద్‌ కాలేజ్‌.. 73 టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, జియాలజీ, హిందీ, హిస్టరీ, మైక్రోబయాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, మ్యాథమెటిక్స్‌ స్పెషలైజేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.చ అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 8, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.