Defence Jobs: ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 97 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
* మొత్తం 97 ఖాళీలకుగాను గ్రేడ్-2 సబ్ డివిజనల్ ఆఫీసర్ 89, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 7, హిందీ టైపిస్ట్ 1 చొప్పున ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. సబ్ డివిజనల్ ఆఫీసర్ పోస్టులకు పదో తరగతితోపాటు, సర్వేయింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. హిందీ టైపిస్ట్ పోస్టుకు పదో తరగతి పాసై నిమిషానికి 25 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పీజీ చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ప్రిన్సిపల్ డైరెక్టర్, డిఫెన్స్ ఎస్టేట్స్, సధరన్ కామండ్, కోడ్వా రోడ్, పుణె – 411040 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: UAE: దుబాయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి నాలుగున్నర రోజులే పనిదినాలు