DCCB Chittoor Recruitment 2022: నెలకు రూ.రూ.57,860ల జీతంతో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార బ్యాంకులో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

DCCB Chittoor Recruitment 2022: నెలకు రూ.రూ.57,860ల జీతంతో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార బ్యాంకులో ఉద్యోగాలు..
DCCB Chittoor Recruitment 2022

Updated on: Nov 06, 2022 | 4:26 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్‌ లేదా ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్‌లో 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పరిజ్ఞానంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా అవసరం. అభ్యర్ధుల వయసు వయసు అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.590లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.413లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.26,080ల నుంచి రూ.57,860 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.