CTET Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జారీ చేసిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఈ రోజే చివరి తేదీ. అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- ctet.nic.in ని సందర్శించి ఫీజులను చెల్లించాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 25గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలని కలలు కనే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 20 సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభించారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 అక్టోబర్ 2021 నుంచి అక్టోబర్ 25కి మార్చారు.
పరీక్ష వివరాలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) తేదీలను విడుదల చేసింది. CTET 15వ ఎడిషన్ CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మోడ్‌లో జరుగుతుంది. 16 డిసెంబర్ 2021 నుంచి 13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.
20 భాషల్లో పరీక్ష జరుగుతుంది
ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, ఖాసీ, మలయాళం, మణిపురి, మరాఠీ, మిజో, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, టిబెటన్, ఉర్దూతో సహా 20 భాషలలో పరీక్ష నిర్వహిస్తున్నారు.
దరఖాస్తు రుసుము
ఇందులో ఒక పేపర్‌కు దరఖాస్తు చేయడానికి జనరల్ / OBC అభ్యర్థులు 1000 రూపాయలు, రెండు పేపర్‌లకు 1200 రూపాయలు చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులకు, దరఖాస్తు రుసుము ఒక పేపర్‌కు రూ. 500 రెండు పేపర్‌లకు రూ. 600గా నిర్ణయించారు.
దరఖాస్తు ఫారమ్‌లో దిద్దుబాటు
CTET అప్లికేషన్ 2021లో దిద్దుబాట్లు చేయడానికి ఆన్‌లైన్ విండో ctet.nic.inలో ఓపెన్ అవుతుంది.అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో 28 అక్టోబర్ 2021 వరకు దిద్దుబాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి అవకాశం ఇవ్వబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.