CSIR-NCL Jobs: 2 లక్షలకుపైగా జీతంతో.. నేషనల్ కెమికల్ లాబొరేటరీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

|

Feb 28, 2022 | 6:46 AM

సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (CSIR-NCL) పూణే.. సైంటిస్ట్ పోస్టుల (Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

CSIR-NCL Jobs: 2 లక్షలకుపైగా జీతంతో.. నేషనల్ కెమికల్ లాబొరేటరీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!
Csir Nil
Follow us on

CSIR-NCL Pune Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (CSIR-NCL) పూణే.. సైంటిస్ట్ పోస్టుల (Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 20

  • సైంటిస్ట్‌ పోస్టులు: 10
  • సీనియర్‌ సైంటిస్ట్‌ పోస్టులు: 4
  • ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 37 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 1,33,936ల నుంచి రూ.2,03,930ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నెట్‌/సెట్‌/స్లేట్ అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 100/-

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ: మార్చి 21, 2022.

అడ్రస్‌: సీఎస్‌ఐఆర్‌ – నేషనల్ కెమికల్ లాబొరేటరీ, డా. హోమీ భాభా రోడ్, పూణే – 411008 (మహారాష్ట్ర).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIPS Mumbai Jobs: ఐఐపీఎస్‌లో అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారానే ఎంపికలు..