CSIR-IICB Recruitment 2022: సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీలో ఉద్యోగాలు.. ఇంటర్ పాసైన నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు..
కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (CSIR-IICB).. తాత్కాలిక ప్రాతిపదికన 17 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల (Junior Secretariat Posts) భర్తీకి..
CSIR-IICB Junior Secretariat Assistant, Junior Stenographer Recruitment 2022: కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (CSIR-IICB).. తాత్కాలిక ప్రాతిపదికన 17 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల (Junior Secretariat Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు, 4 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్ నైపుణ్యాలు కూడా ఉండాలి. వయసు ఖచ్చితంగా 28 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు జీతంగా రూ.30,000ల నుంచి రూ.38,000ల వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిచ చేయడం జరుగుతుంది.
రాత పరీక్ష విధానం: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1లో మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 90 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 పరీక్ష 50 ప్రశ్నలకు 150 మార్కులకుగానూ ఒక గంటలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండు పేపర్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 4. 2022.
- దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 24. 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.