Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై వీడని సందిగ్ధత.. కారణం ఏంటో చెప్పని బోర్డు అధికారులు

|

May 08, 2023 | 1:10 PM

ఇంటర్ పరీక్షలు జరిగి నెల రోజులు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందించడం లేదు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం.  ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి..

Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై వీడని సందిగ్ధత.. కారణం ఏంటో చెప్పని బోర్డు అధికారులు
Andhra Inter Students
Follow us on

తెలంగాణలో ఇంటర్ పలితాల విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఉత్కంఠగా ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇంటర్ పరీక్షలు జరిగి నెల రోజులు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందించడం లేదు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం.  ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ప‌రీక్షల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. 20 రోజుల క్రితమే పేపర్ వాల్యుయేషన్ పూర్తి అయ్యింది. అంతా రెడీ అంటూనే ఫలితాల విడుదలపై వెనుకాడుతున్నారు అధికారులు.

గత అనుభవాల దృష్ట్యా భయంతో ఉన్నారు అధికారులు. పరీక్షలకు తొమ్మిదిన్నర లక్షల మంది హాజర్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితాల విషయంలో ఎలాంటి టెక్నికల్ సమస్య ఎదురవకూడదనే ఉద్దేశంతో ఒకటికి రెండు మార్లు ట్రయల్స్ నిర్వహించినట్లుగా అధికారులు చెబుతున్నారు.

కాగా, ఇంటర్ పరీక్షల జవాబు పత్రాలను ఈసారి ఆన్ లైన్ మూల్యాంకనం చేపట్టాలని బోర్డు తొలుత నిర్ణయించింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆఫ్ లైన్ లోనే మూల్యాంకనం పూర్తిచేసింది.

ఇదిలావుంటే, ఇప్పటికే ఏపీ ఫలితాలు వెలువడడంతో తెలంగాణలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇంటర్ బోర్డుపై పెరుగుతున్న ఒత్తిడి.. రెగ్యులర్ కమిషనర్ లేక పోవడం, అనుభవం లేని వారికి ఇంటర్ ఎగ్జామినేషన్ విభాగం బాధ్యతలు అప్పగించడం కారణం అంటున్నారు ఇంటర్ విద్యార్థి జేఏసీ.

ఇవాళ సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందని అంటున్నారు విద్యా శాఖ వర్గాలు. ఎల్లుండి నుంచి మొదలు కానున్న ఎంసెట్ ఎగ్జామ్. ఫలితాలు రాక తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు ఇంటర్ విద్యార్థులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం