Coffee Board Recruitment 2022: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కాఫీ బోర్డులో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..

|

Nov 03, 2022 | 3:23 PM

భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని కాఫీ బోర్డు.. ఒప్పంద ప్రాతిపదికన బరిస్టా ట్రైనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Coffee Board Recruitment 2022: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కాఫీ బోర్డులో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
Coffee Board Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని కాఫీ బోర్డు.. ఒప్పంద ప్రాతిపదికన బరిస్టా ట్రైనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే బరిస్టాగా రెండు నుంచి ఐదేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 21, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Divisional Head – Coffee Quality, Coffee Board, No.1, Dr. B.R.Ambedkar Veedhi, Bengaluru – 560 001.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.